ఏపీ కరోనా అప్ డేట్: 1,056 కొత్త కేసులు, 14 మరణాలు

15-11-2020 Sun 18:47
  • గడచిన 24 గంటల్లో 53,215 కరోనా టెస్టులు
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 206 కేసులు
  • అత్యల్పంగా శ్రీకాకుళంలో 24 పాజిటివ్ కేసులు
AP Covid cases and deaths

ఏపీలో కరోనా కేసుల వివరాల బులెటిన్ విడుదలైంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 53,215 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,056 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 206 కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14 మంది మరణించారు. 2,140 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,54,011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,28,484 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 18,659 మంది మాత్రమే. అటు, కరోనా మృతుల సంఖ్య 6,868కి చేరింది.