సూర్యాపేటలో కలకలం.. చిన్నారి అదృశ్యం.. కిడ్నాప్ కేసు నమోదు

15-11-2020 Sun 11:15
  • టపాసులు కొనుక్కునేందుకు వెళ్లిన బాలుడు
  • తిరిగి రాని వైనం
  • భగత్‌సింగ్‌ నగర్‌లో ఘటన
  • గాలిస్తోన్న పోలీసులు
five years old boy kidnaps

దీపావళి పర్వదినాన టపాసులు కొనుక్కుందామని దుకాణానికి వెళ్లిన ఓ బాలుడు కనపడకుండాపోయాడు. టపాసుల దుకాణానికి వెళ్లి తమ కుమారుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఘటన  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ నగర్‌లో నిన్న రాత్రి చోటు చేసుకుంది.

పి.మహేశ్‌ కుమారుడు గౌతమ్‌ (5) అదృశ్యమయ్యాడు. గౌతమ్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ దొరకకపోవడంతో ఈ రోజు ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న చిన్నారుల కిడ్నాప్ ఉదంతాలు మరవకముందే ఇటువంటిదే మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.