నాన్న కోలుకుంటున్నారు: హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక

15-11-2020 Sun 10:56
  • కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న రాజశేఖర్
  • కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి
  • ఫొటో పోస్ట్ చేసిన శివాత్మిక
dad is recovering shivatmika

సినీనటుడు రాజశేఖర్ కుటుంబం కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ ఐసీయూలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో గడిపిన ఫొటో బయటకు వచ్చింది.

దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోను కూతురు శివాత్మిక పోస్ట్ చేసింది.  ‘మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాన్న కోలుకుంటున్నారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె ట్వీట్ చేసింది.