TikTok: ట్రంప్‌పై దావాను ఉపసంహరించుకోనున్న టిక్‌టాక్ ఉద్యోగి

  • టిక్‌టాక్‌పై నిషేధంతో ట్రంప్ ప్రభుత్వంపై దావా
  • కేసును కొట్టివేయాలంటూ ఇప్పుడు దరఖాస్తు
  • కారణాలు వెల్లడించని వైనం
TikTok employee agrees to drop suit against Trump administration

షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించినందుకు గాను ట్రంప్ ప్రభుత్వంపై దావా వేసిన టిక్‌టాక్ ఉద్యోగి వెనక్కి తగ్గారు. ఇప్పుడా దావాను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఈ నెల 13న పాట్రిక్ ఎస్.ర్యాన్ కోర్టుకు దరఖాస్తు చేశారు. కేసును కొట్టివేయాలని ఇరు పక్షాలు కోరుతున్నట్టు అందులో పేర్కొన్నారు.

అయితే, దావాను వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారన్న కారణం మాత్రం తెలియరాలేదు. కాగా, అమెరికాలోని ఆస్తుల విక్రయానికి టిక్‌టాక్ యజమాన్యం బైట్‌డ్యాన్స్‌కు ఈ వారం మరో 15 రోజుల గడువు లభించింది. నిషేధం నేపథ్యంలో అమెరికాలో టిక్‌టాక్ ముందుకు సాగడం కష్టమని అమెరికా వాణిజ్య విభాగం తేల్చి చెప్పింది.

More Telugu News