చిచ్చుబుడ్డికి భయపడి అమ్మ వెనుక దాక్కున్న వర్మ.. వీడియో ఇదిగో

15-11-2020 Sun 09:25
  • దీపావళి టపాసులు కాల్చిన వర్మ
  • సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా భయం
  • తాను చాలా పిరికివాడినని కామెంట్
varma celebrates deepavali

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన నివాసం వద్ద దీపావళి సందర్భంగా టపాసులు కాల్చాడు. అయితే, ఆయన సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా భయపడుతూ ఆయన తల్లి వెనుక దాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

తాను చాలా పిరికివాడినని, ఈ కారణం వల్లే తన తల్లి వెనుక దాక్కున్నానని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.  అనంతరం ఆయన కూడా  చిచ్చుబుడ్లు కాల్చడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వర్మ పోస్ట్ చేశారు. దీపావళి నేపథ్యంలో తాను కూడా వాయు, శబ్ద కాలుష్యం పెరగడానికి తన వంతు సహకారం ఆందిస్తున్నానని చురకలంటించారు.