India: కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ ఆగ్రహం.. పాక్ దౌత్యాధికారికి సమన్లు

  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
  • పాక్ చర్య ఉద్దేశపూరితమేనన్న భారత్
  • పండుగ వేళ  శాంతిని భగ్నం చేసే కుట్రని మండిపాటు
India summons pak diplomat over ceasefire

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నలుగురు భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పండుగ వేళ పాక్ ఉద్దేశపూర్వకంగానే సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుందని, శాంతిని భగ్నం చేసేందుకు హింసకు పాల్పడుతోందని మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ (పీఏఐ డెస్క్) జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ పాక్ హైకమిషన్ ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పాక్ ఆర్మీ శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉరి నుంచి గురెజ్ వరకు యథేచ్ఛగా కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. ఆరుగురు పౌరులు గాయపడ్డారు. ప్రతిగా భారత్ దళాలు జరిపిన దాడిలో 11 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. హతమైన పాక్ సైనికుల్లో ఇద్దరు-ముగ్గురు పాక్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News