కరోనా తగ్గినా... కన్నుమూసిన తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా!

15-11-2020 Sun 08:30
  • 1999 నుంచి 2004 వరకూ ఎమ్మెల్యేగా విధులు
  • కరోనా నుంచి కోలుకున్నాక అనారోగ్యం
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు
Tanuku Ex MLA YT Raja Passes Away

ఆంధ్రప్రదేశ్ లోని తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా, చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత, వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ కు వెళ్లిన ఆయనకు ఆరోగ్యం విషమించింది. దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వైటీ రాజా చేరారు. పరిస్థితి విషమించి ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, వైటీ రాజా, 1999 నుంచి 2004 వరకూ తణుకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.