ఐపీఎల్ బెట్టింగ్‌లో ఓటమి.. మనస్తాపంతో ఇద్దరు యువకుల ఆత్మహత్య

15-11-2020 Sun 07:56
  • ఐపీఎల్ బెట్టింగులో ఓటమి పాలై లక్షలాది రూపాయల బాకీ
  • నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగుల మందుతాగిన వైనం
  • చికిత్స పొందుతూ మృతి
two teenagers suicide after loss in IPL Betting

ఐపీఎల్ బెట్టింగులో ఓటమి ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది. గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమరయ్య, సురేశ్‌లు ఐపీఎల్‌ బెట్టింగులో ఓటమి పాలై లక్షలాది రూపాయలు బాకీ పడ్డారు. డబ్బులు చెల్లించాలంటూ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయిన వీరిద్దరూ ఈ నెల 9న రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు.

గమనించిన కొందరు వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు సురేశ్ మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రికెట్ బుకీలైన బాజి, తిరుపతిరావులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.