హైదరాబాద్‌లోని రిలయన్స్ డిజిటల్‌లో భారీ దోపిడీ.. రూ. 40 లక్షల విలువైన సెల్‌ఫోన్ల చోరీ!

15-11-2020 Sun 07:13
  • మదీనాగూడలోని రిలయన్స్ షోరూంలో చోరీ
  • దొంగతనం కారణంగా షోరూం మూసివేత
  • నిందితుల కోసం ఐదు బృందాలతో గాలిస్తున్న పోలీసులు
40 lakh worth mobile phones stolen from reliance digital

హైదరాబాద్ శివారులోని మదీనాగూడలో ఉన్న రిలయన్స్ డిజిటల్ షోరూంలో భారీ దొంగతనం జరిగింది. షోరూంలోకి ప్రవేశించిన దొంగలు దాదాపు 40 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను తస్కరించారు. ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం నేపథ్యంలో యాజమాన్యం నిన్న షోరూంను మూసివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్లతోపాటు ఇంకేమైనా చోరీకి గురయ్యాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇంతపెద్ద దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుల కోసం పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.