15 మంది డీఎస్పీలను బదిలీ చేసిన తెలంగాణ!

15-11-2020 Sun 06:29
  • కలెక్టర్లను బదిలీ చేసిన గంటల వ్యవధిలోనే ఉత్తర్వులు
  • ఇంటెలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాసరావు నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
Telangana Transfered15 DSPs

పలువురు కలెక్టర్లను బదిలీ చేసిన గంటల వ్యవధిలోనే, 15 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రకటించింది. డీజీపీ మహేందర్ రెడ్డి నిన్న డీఎస్పీల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్ ను, బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్ ను,  సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీని నియమిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి, పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి, పంజాగుట్ట  ఏసీపీగా గణేష్, సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్, శంషాబాద్ ఏసీపీగా భాస్కర్, బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి, ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాసరావులను నియమించామని స్పష్టం చేశారు.