Kangaroo: కంగారూ పిల్లను పోస్టు బాక్సులో వేసిన ఆకతాయి... కాపాడిన అధికారులు!

  • ఆస్ట్రేలియాలో తుంటరి చర్య
  • నెటిజన్ల ఆగ్రహం
  • మనసులేని కర్కోటకుడు అంటూ మండిపాటు
Kangaroo in postbox

కంగారూ జంతువులు కేవలం ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కూడా కంగారూనే. అయితే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతంలో ఓ ఆకతాయి కంగారూ పిల్లను పోస్టు బాక్సులో వేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహావేశాలు కలిగించింది. వూంగూల్బా వద్ద ఓ పోస్టు బాక్సులో కంగారూ పిల్ల ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది.

దీనిపై వెంటనే స్పందించిన క్వీన్స్ లాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని కంగారూ పిల్లను పోస్టు బాక్సు నుంచి బయటికి తీశారు. కంగారూ పిల్ల కథ సుఖాంతం కావడం తమకు ఆనందం కలిగిస్తోందని అధికారులు వెల్లడించారు.

ఈ విషయాన్ని అధికారులే సోషల్ మీడియాలో పోస్టు చేయగా, కంగారూ పిల్లను పోస్టు బాక్సులో వేసిన తుంటరిని నెటిజన్లు ఓ రేంజిలో తిట్టిపోశారు. "ఎందుకు ఇలా చేస్తారు?", "ఈ భూమండలంపై మనుషులే అత్యంత చెత్త జాతి", "మనసులేని కర్కోటకుడు" అంటూ నెటిజన్లు తలోరకంగా స్పందించారు.

More Telugu News