దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

14-11-2020 Sat 21:34
  • నేడు దీపావళి
  • వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించిన ట్రంప్
  • స్వయంగా దీపాలు వెలిగించిన వైనం
Donald Trump conveys Diwali wishes

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్ హౌస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ దీపావళి వేడుకలు జరిపారు. ఆయన స్వయంగా దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే ప్రత్యేక సందేశం పంపారు.