Chiranjeevi: భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

Chiranjeevi visits K V iswanath along with his wife Surekha
  • కె.విశ్వనాథ్ తో చిరు ఆత్మీయ సమావేశం
  • కళాతపస్వి దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించిన చిరు, సురేఖ
  • చిరును హత్తుకుని మురిసిపోయిన కె.విశ్వనాథ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తనకు కరోనా అని వెల్లడించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే తప్పుడు కరోనా కిట్ వల్ల పాజిటివ్ అని వచ్చిందని చిరు స్వయంగా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు కరోనా లేదని నిర్ధారణ కావడంతో చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక అసలు విషయానికొస్తే... చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ దీపావళి సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు. విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా తనకు పాదాభివందనం చేసిన చిరంజీవిని కె.విశ్వనాథ్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని వాత్సల్యం ప్రదర్శించారు. ఇరువురు అనేక విషయాలు ముచ్చటించారు. విశ్వనాథ్ దంపతుల యోగక్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. కాగా, చిరంజీవి దంపతులు పండుగ నాడు తమ నివాసానికి రావడం పట్ల కె.విశ్వనాథ్ హర్షం వ్యక్తం చేశారు.
Chiranjeevi
Surekha
K Viswanath
Kalatapaswi
Tollywood

More Telugu News