సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

14-11-2020 Sat 07:34
  • 'ఆదిపురుష్' నాయికగా మరో పేరు!
  • ఫిబ్రవరికి వాయిదా వేసిన రజనీకాంత్
  • నాగశౌర్య సినిమా 'వరుడు కావలెను'  
Ananya Panday is considered for Prabhas Adipurush
*  ప్రభాస్ హీరోగా నటించే 'ఆదిపురుష్' సినిమాలో కథానాయిక సీత పాత్ర ఎవరు పోషిస్తారన్న విషయంలో గత కొంతకాలంగా పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ భామ అనన్య పాండే పేరు తెరపైకి వచ్చింది. చిత్ర బృందం ప్రస్తుతం అనన్యతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదాపడింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులలో షూటింగ్ చేయడం రిస్క్ అన్న భావనలో వున్న రజనీ షూటింగును వాయిదా వేయమన్నట్టు తెలుస్తోంది.
*  నాగశౌర్య హీరోగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి 'వరుడు కావలెను' అనే వెరైటీ టైటిల్ని నిర్ణయించారు. ఇందులో రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది.