Nitish Kumar: సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్

  • 29వ తేదీతో ముగుస్తున్న బీహార్ అసెంబ్లీ పదవీకాలం
  • తదుపరి ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తూ నితీశ్ రాజీనామా
  • రెండు రోజుల్లో నితీశ్ ను తమ నేతగా ప్రకటించనున్న ఎన్డీయే
Nitish Kumar resigns

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ కు సమర్పించారు. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తోంది. దీంతో, కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తూ ఆయన రాజీనామా చేశారు. మరోవైపు తమ నేతగా నితీశ్ కుమార్ ను ఎన్డీయే అధికారికంగా ప్రకటించబోతోంది. మరో రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుంది.

15వ తేదీన రాష్ట్రంలోని ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో తమ శాసనసభాపక్ష నేతగా నితీశ్ ను ఎన్నుకుంటారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ గవర్నర్ ను కలిసి తెలియజేస్తారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈ లాంఛనాలపై చర్చించేందుకు ఈరోజు జేడీయూ, బీజేపీ, ఇతర భాగస్వామ్య పార్టీలు భేటీ అయ్యాయి. ఎన్నికలకు ముందే నితీశ్ కుమార్ ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News