Gorati Venkanna: ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న... ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Telangana cabinet decides to fill up MLC vacancies
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నిర్ణయం
  • గోరటి, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ల పేర్లు ఖరారు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ హైదరాబాద్ ప్రగతిభవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని తీర్మానించింది. ప్రముఖ జన వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గోరటితోపాటు మాజీమంతి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నేత బొగ్గారపు దయానంద్ ల పేర్లను మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖరారు చేసింది. ఆపై మూడు పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదించాక నోటిఫికేషన్ వెలువడనుంది.
Gorati Venkanna
MLC
Telangana Cabinet
KCR
Telangana
TRS

More Telugu News