Rain: ఏపీలో మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు

  • చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
  • రుతుపవనాలకు తోడైన అల్పపీడన ద్రోణి
  • దక్షిణ కోస్తాకు వర్ష సూచన
Rain forecast for AP for five days

ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడడం వంటి కారణాలతో ఏపీలో గత కొన్నిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు ఇదేవిధంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ అప్రమత్తం చేసింది.

కాగా, ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా మారడంతో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని దగదర్తిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 190.75 మిమీ వర్షపాతం రికార్డయింది. ముత్తుకూరులోనూ 187.25 మిమీ మేర వర్షం కురిసినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెపలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) వెల్లడించింది.

ఏపీఎస్డీపీఎస్ కమిషనర్ కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, దక్షిణ కోస్తా జిల్లాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుందని తాము ముందే చెప్పామని ఆయన తెలిపారు.

More Telugu News