Tiger: ఫేక్ టైగర్ తో ప్రాంక్ వీడియో...వారం రోజుల్లో 50 లక్షల మందికి పైగా చూసిన వీడియో ఇదిగో!

  • పులి బొమ్మతో థాయ్ యువకుని వీడియో
  • నిజమైన పులిగా భావించి హడలిపోయిన జంతువులు
  • జంతువులకు క్షమాపణలు చెప్పి, ఆహారం ఇచ్చిన యువకుడు
Prank Video with Stuffed Tiger goes viral

ఓ థాయ్ ల్యాండ్ యువకుడు పెద్దపులి బొమ్మను పెట్టి చేసిన ఓ ప్రాంక్ వీడియో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కేవలం వారం రోజుల వ్యవధిలో 54 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుని వైరల్ అవుతోంది. ఆ బొమ్మను చూసిన పలు కోతులు, దాన్ని నిజమైన పులిగా భావించి హడలిపోతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. కోతులు మాత్రమే కాదు... దీన్ని చూసిన శునకాలు సైతం బెంబేలెత్తిపోయి భయంతో అరుపులు పెట్టాయి.

ఇక, జంతువులను భయపెట్టినందుకు క్షమాపణలు చెప్పిన యూట్యూబర్, ఆపై వాటికి ఆహారాన్ని అందించాడు. ఏంజల్ నాగా అనే యూ ట్యూబ్ చానెల్ లో ఈ వీడియో తొలుత ప్రత్యక్షమైంది. ఆపై ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోకి ఎక్కింది. పులి బొమ్మను చూసిన వివిధ జంతువులు ఎలా స్పందిస్తున్నాయో మీరూ ఈ వీడియోలో చూడవచ్చు.

More Telugu News