Nalgonda District: నల్గొండ సీఐ వాహనం తీసుకుని పరార్... సినీ ఫక్కీలో ఛేజ్!

  • నిన్న రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • పక్కనే ఉన్న వాహనాన్ని ఎత్తుకెళ్లిన యువకుడు
  • కోదాడ మార్గంలో యాక్సిడెంట్
Police Vehicle Stolen in Nalgonda Dist

నల్గొండ రూరల్ సీఐ రమేశ్ బాబు వాహనం చోరీకి గురికాగా, సినీ ఫక్కీలో ఛేజ్ జరిగింది. ఈ ఘటన మిర్యాలగూడ, ఈదుల గూడ సర్కిల్ వద్ద జరిగింది. నిన్న రాత్రి మద్యం తాగి వస్తున్న నలుగురు యువకులను పోలీసులు విచారిస్తున్న వేళ, పక్కనే ఉన్న పోలీసు వాహనాన్ని తీసుకుని ఓ యువకుడు పరారయ్యాడు. అతను కోదాడ వైపు వెళుతుండటాన్ని గమనించిన పోలీసులు, పలు టీమ్ లను ఎలర్ట్ చేశారు.

ఆపై పోలీసుల ఛేజింగ్ ప్రారంభం కాగా, ఆలగడప టోల్ గేట్ సమీపంలో పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం ధ్వంసమైంది. ఆ వెంటనే వెనకే వస్తున్న రూరల్ ఎస్ఐ పరమేశ్ టీమ్, వాహనాన్ని, దాన్ని తీసుకెళ్లిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News