Donald Trump: అలాస్కాలో ట్రంప్ దే విజయం... ట్వీట్ చేసిన ఇవాంకా

Donald Trump wins Alaska  and get three electoral votes
  • కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ట్రంప్ ఖాతాలో మరో 3 ఎలక్టోరల్ ఓట్లు
  • ట్రంప్ ఓట్ల సంఖ్య 217కి చేరిన వైనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాస్కా రాష్ట్ర ఫలితం వెలువడింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందులో విజయం సాధించారు. ఈ విజయంతో ట్రంప్ ఖాతాలో మరో 3 ఎలక్టోరల్ ఓట్లు చేరాయి. దాంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓట్ల సంఖ్య 217కి పెరిగింది.

అంతేకాదు, అలాస్కాలో ఓ సెనేట్ స్థానం కూడా నెగ్గడంతో 100 మంది సభ్యుల సెనేట్ లో రిపబ్లికన్ల బలం 50కి చేరింది. అలాస్కాలో ట్రంప్ గెలిచిన విషయాన్ని ఆయన కుమార్తె ఇవాంకా వెల్లడించారు. అలాస్కాలో 20 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ నెగ్గినట్టు ట్వీట్ చేశారు.

అటు, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఖాతాలో ఇప్పటికే 290 ఓట్లు ఉండడంతో ఆయనే విజేత అయ్యారు. ఓట్ల సంఖ్యాపరంగా బాగా వెనుకబడి ఉన్నప్పటికీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ట్రంప్ ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలపై ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించారు. దాంతో అధికార బదలాయింపు ప్రక్రియ ఏమంత సజావుగా సాగేట్టు కనిపించడంలేదు.
Donald Trump
Alaska
Electoral Votes
Elections
Ivanka Trump
USA

More Telugu News