ఏపీలో మరో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం!

12-11-2020 Thu 20:15
  • విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం
  • ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కల్యాణ్ అనే వ్యక్తి
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికుల డిమాండ్
Inter student raped in AP

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం చెలరేగిపోతున్నారు. వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో మరో ఘోరం సంభవించింది. జిల్లాలోని జి.మాడుగుల మండలం కుంబిడిసింగిలో ఇంటర్ విద్యార్థినిపై కల్యాణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు, దారుణానికి ఒడిగట్టిన కల్యాణ్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.