Jacinda Ardern: వాటిని నెరవేర్చుకున్నాకే పెళ్లి చేసుకుంటాం: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా

We have few plans for our marriage says Jacinda Ardern
  • క్లార్క్ గేఫోర్డ్ తో జెసిండాకు నిశ్చితార్థం
  • రెండేళ్ల క్రితం కూతురుకి జన్మనిచ్చిన జెసిండా
  • పెళ్లి కోసం కొన్ని ప్రణాళికలు ఉన్నాయన్న ప్రధాని
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ (40)కి టీవీ వ్యాఖ్యాత క్లార్క్ గేఫోర్డ్ (44)కి గతంలోనే నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరికీ ప్రస్తుతం రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే వీరికి ఇంకా పెళ్లి మాత్రం జరగలేదు. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ తమ వివాహానికి సంబంధించి తమకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయని ఆమె చెప్పారు. తమ కుటుంబసభ్యులు, మిత్రులతో వాటిని పంచుకోవాలని... వాటిని నెరవేర్చుకున్నాక పెళ్లి చేసుకుంటామని తెలిపారు. అవి నెరవేర్చుకునేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

జెసిండా ఆర్డెర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సాధించి, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Jacinda Ardern
New Zealand
Prime Minister
Marriage

More Telugu News