అన్నవరం హుండీ లెక్కింపులో పురోహితుడి చేతివాటం... శాశ్వతంగా వేటు వేసిన అధికారులు

12-11-2020 Thu 16:47
  • అన్నవరం ఆలయంలో ఘటన
  • రూ.11 వేలు నగదు ఎత్తుకెళుతున్న పురోహితుడు
  • తనిఖీల్లో పట్టుకున్న ఆలయ భద్రతా సిబ్బంది
Annavaram priest caught stealing money from temple Hundi

తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుని ఆలయంలో పురోహితుడి చేతివాటం వెల్లడైంది. ఆలయ హుండీ లెక్కింపులో పురోహితుడు శ్రీనివాస శర్మ నగదు, కానుకలు కొట్టేస్తున్నట్టు గుర్తించారు. ఈ పురోహితుడు హుండీ నుంచి రూ.11 వేల వరకు నగదు తీసుకెళుతుండగా ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో పురోహితుడు శ్రీనివాస శర్మను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.