Ron Klain: వైట్ హౌస్ చీఫ్ గా తన పాత మిత్రుడ్ని నియమించిన జో బైడెన్

Joe Biden appoints his old friend Ron Klain as White House Chief
  • అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్
  • జనవరి 20న పదవీ ప్రమాణస్వీకారం
  • స్నేహితుడు రాన్ క్లైన్ కు మరోసారి కీలక బాధ్యతలు
  • 31 ఏళ్లుగా బైడెన్, రాన్ క్లైన్ మధ్య స్నేహం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ వైట్ హౌస్ లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా, వైట్ హౌస్ చీఫ్ గా తన పాత మిత్రుడు రాన్ క్లైన్ ను నియమించారు. జో బైడెన్, రాన్ క్లైన్ మధ్య సుదీర్ఘమైన స్నేహ బంధం ఉంది. గత 31 ఏళ్లుగా వీరిద్దరూ స్నేహితులు. 59 ఏళ్ల క్లైన్ కరుడుగట్టిన డెమొక్రాట్ గా గుర్తింపు పొందారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన క్లైన్ కు వైట్ హౌస్ పరిస్థితులు కొత్తేమీకాదు. గతంలో బరాక్ ఒబామా హయాంలో జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు క్లైన్ ఆయనకు ప్రత్యేక సహాయకుడిగా ఉన్నారు. కాగా, వైట్ హౌస్ చీఫ్ గా క్లైన్ ను నియమించిన సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ, క్లైన్ అన్ని పార్టీలకు దగ్గరి వ్యక్తి అని, క్లిష్ట సమయాల్లో ఎలా పనిచేయాలో తెలిసినవాడని వివరించారు. ముఖ్యంగా తనకు విలువైన మిత్రుడు అని తెలిపారు.

కాగా, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20న పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Ron Klain
White House Chief
Joe Biden
Democrat
USA

More Telugu News