అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ నేతలు దోచుకుంటున్నారు: సునీల్ దేవధర్

12-11-2020 Thu 14:17
  • తిరుపతిలో బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
  • హాజరైన సునీల్ దేవధర్, సోము వీర్రాజు
  • తిరుపతి అభివృద్ధికి కేంద్రం వేలకోట్లు ఇచ్చిందన్న దేవధర్
Sunil Deodhar makes allegations on YCP leaders

వైసీపీ నేతలపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ధ్వజమెత్తారు. తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ఏపీలో సనాతన హిందూ ధర్మం ప్రమాదంలో పడిందని అన్నారు. దేవాలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

తిరుపతి అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల నిధులను కేటాయించిందని వెల్లడించారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు బీజేపీ నేతలు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.