Bellamkonda Ganesh: ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని మ్యుటేషన్ పత్రాలు పొందిన యంగ్ హీరో

Bellamkonda Ganesh registered his land details in Dharani portal
  • ఇటీవలే ధరణి పోర్టల్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
  • నల్గొండ తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన బెల్లంకొండ గణేశ్
  • మిత్రులతో కలిసి చర్లపల్లిలో భూమి కొనుగోలు చేసిన గణేశ్
తెలంగాణలో భూముల వివరాల నమోదు కొరకు ఇటీవలే ధరణి పోర్టల్ ప్రారంభించారు. టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, యంగ్ హీరో బెల్లంకొండ సాయిగణేశ్ కూడా ధరణి పోర్టల్ లో తన భూమి వివరాలు నమోదు చేసుకున్నారు.

 బెల్లంకొండ గణేశ్ ఇవాళ నల్గొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. నల్గొండ మండలం చర్లపల్లిలో గణేశ్, మరో ఇద్దరు మిత్రులతో కలిసి భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడా భూమి వివరాలను ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన మ్యుటేషన్ పత్రాలను కూడా పొందారు.

బెల్లంకొండ గణేశ్ తన అన్న బెల్లంకొండ శ్రీనివాస్ బాటలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం కానుంది.
Bellamkonda Ganesh
Dharani Portal
Registration
Land
Mutation
Nalgonda District
Telangana

More Telugu News