Andhra Pradesh: మరో నాలుగైదు గంటల్లో ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

  • గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
  • హెచ్చరించిన విపత్తులశాఖ కమిషనర్
Heavy rains forecast to Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కన్నబాబు ప్రజలను అప్రమత్తం చేశారు.

More Telugu News