Bellamkonda Sai Srinivas: హిందీలో 'ఛత్రపతి' రీమేక్.. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్!

Bellamkonda Sai Srinivas to be introduced to Bollywood
  • 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయం 
  • యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న బెల్లంకొండ
  • 'ఛత్రపతి'ని రీమేక్ చేస్తున్న బాలీవుడ్ సంస్థ  
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా చిత్రసీమకి హీరోగా పరిచయమైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. తొలి సినిమా 'అల్లుడు శీను'తోనే మంచి యాక్షన్ హీరోగా .. ఈజ్ వున్న నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. తదనంతర కాలంలో చేసిన 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయక', 'రాక్షసుడు' వంచి చిత్రాలు అతనిని యాక్షన్ హీరోగా నిలబెట్టాయి.

ఈ క్రమంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' చిత్రంలో నటిస్తున్న సాయి శ్రీనివాస్.. త్వరలో బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నాడు. గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' హిట్ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ రీమేక్ చేస్తోంది. దీనికి సాయిశ్రీనివాస్ ను హీరోగా ఎంచుకుంది. దీనికి బాలీవుడ్ దర్శకుడే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

'ఛత్రపతి' కథ యాక్షన్ ఓరియెంటెడ్ ఎమోషన్స్ తో సాగే కథ కాబట్టి ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బాగా నప్పుతుందని, బాలీవుడ్ లో అతనికి మంచి ఎంట్రీ అవుతుందని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇదిలావుంచితే, ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు సాయి శ్రీనివాస్ సుపరిచితుడు!
Bellamkonda Sai Srinivas
Prabhas
Chatrapati
Bollywood

More Telugu News