OTT: కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర మాధ్యమాలు

  • ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మితిమీరిన ఆశ్లీలత
  • కొరడా ఝుళిపించిన కేంద్రం
  • ఓటీటీ మాధ్యమాన్ని తన నియంత్రణలోకి తీసుకున్న వైనం
online news portals now under govt regulation

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఆన్ లైన్ మీడియా, సినిమాలు, న్యూస్ కంటెంట్ ను తమ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన చట్ట సవరణపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు.

ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి ఎంటర్టైన్ మెంట్ మాధ్యమాలన్నీ కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ పరిధిలోకి వస్తాయి. ప్రింట్ మీడియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కిందే ఉండబోతోంది. అయితే ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కిందకు వస్తుంది.

సినిమాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నియంత్రిస్తుంది. మీడియాలో వచ్చే యాడ్స్ ను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సంబంధించి మాత్రం ఇంత వరకు ఎలాంటి చట్టం కానీ, దాన్ని నియంత్రించే వ్యవస్థ కానీ రాలేదు. తాజా నిర్ణయంతో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మితిమీరిన అశ్లీలతకు ఇకపై అడ్డుకట్ట పడబోతోంది.

More Telugu News