raghunandan rao: శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకున్న ‘దుబ్బాక’ ఉప ఎన్నిక విజేత రఘునందన్ రావు

raghunandan rao at ttd
  • ఈ రోజు ఉదయం  తిరుమలకు రఘునందన్ రావు
  • మొక్కులు చెల్లించుకున్న నేత
  • అనంతరం శ్రీవారి దర్శనం  
టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి, దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో విజయ దుందుభి మోగించిన బీజేపీ అభ్యర్థి రఘునందర్‌రావు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

కాగా, అనూహ్య రీతిలో రఘునందర్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిని రెండో స్థానానికి పరిమితం కాగా, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి నిలిచారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడడానికి ఈ విజయం తమలో జోష్ నింపిందని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
raghunandan rao
TTD
Tirumala

More Telugu News