Pawan Kalyan: ‘గమనం’ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్!

Gamanam Trailer  Unveiled by Powerstar PawanKalyan
  • ప్యాన్‌ ఇండియా మూవీగా 'గమనం'
  • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా
  • కీలక పాత్రల్లో శ్రియ, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్
ప్యాన్‌ ఇండియా మూవీ 'గమనం' తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఈ సినిమా విడుదల కాబోతుంది. హిందీ వర్షన్ ట్రైలర్ ను సోనూసూద్, తమిళ ట్రైలర్ ను జయం రవి, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళ వర్షన్ ట్రైలర్ ను ఫహద్ ఫసిల్ విడుదల చేశారు.

ఈ సినిమాకు సాయిమాధ‌వ్ బుర్రా మాటలు రాశారు. రమేశ్ క‌రుటూరి, వెంకీ పుషా‌డ‌పు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో శ్రియ, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో బధిర యువతిగా నటించిన శ్రియ ఒళ్లో చంటిబిడ్డతో కనపడుతోంది. మూడు కథలను పరిచయం చేస్తూ గమనం ట్రైలర్ ను విడుదల చేశారు.  
   
Pawan Kalyan
Tollywood
trailer

More Telugu News