Chetan Chauhan: యూపీ ఉప ఎన్నికల్లో మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ భార్య విజయ ఢంకా

Chetan Chauhans wife Sangeeta Chauhan of BJP wins
  • ఆగస్టులో కరోనాతో కన్నుమూసిన చేతన్ చౌహాన్
  • ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక
  • తనను గెలిపించిన ప్రజలకు సంగీత కృతజ్ఞతలు

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల బరిలో నిలిచిన మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ భార్య విజయం సాధించారు. నవేగావ్ సాదత్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చౌహాన్ భార్య సంగీత చౌహాన్ 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేబినెట్ మంత్రి అయిన చేతన్ చౌహాన్  కరోనాతో ఈ ఏడాది ఆగస్టు 16న కన్నుమూశారు. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, బీజేపీ తమ అభ్యర్థిగా సంగీతను ప్రకటించింది.


61 ఏళ్ల సంగీత రాజకీయాల్లోకి రావడానికి మునుపు బ్యాంకర్‌గా, హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. తన భర్త రాజకీయ వ్యవహారాల మేనేజర్‌గానూ వ్యవహరించారు. విజయానంతరం సంగీత మాట్లాడుతూ తన భర్త మరణించినా తనతోనే ఉన్నారని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Chetan Chauhan
Uttar Pradesh
Sangeeta Chauhan
Elections
BJP

More Telugu News