Rajasthan: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాదం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి 8 మంది మృతి

wall Collapses In Jodhpur 8 Dead
  • బస్ని పారిశ్రామిక ప్రాంతంలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమం
  • ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గత రాత్రి నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జోధ్‌పూర్‌లోని బస్ని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిందీ ఘటన. పైకప్పుపై మెటాలిక్ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 14 మందిని శిథిలాల కింది నుంచి రక్షించగా, వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదంలో 8 మంది చనిపోవడంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారి కుటుంబాలకు 40 వేల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. నిర్మాణం జరుగుతున్న భవనం ఇంటి యజమాని, కాంట్రాక్టర్లను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Rajasthan
Building
collapse
Ashok Gehlot

More Telugu News