Kishan Reddy: తెలంగాణ వ్యాప్తంగా ఇదే ప్రభంజనం కొనసాగిస్తాం: దుబ్బాక విజయంపై కిషన్ రెడ్డి స్పందన

Kishan Reddy says BJP continues the winning streak
  • టీఆర్ఎస్ ఆయువుపట్టులోనే గెలిచామన్న కిషన్ రెడ్డి
  • ఈ విజయం బలాన్నిస్తుందని వ్యాఖ్యలు
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చూపుతామని వెల్లడి
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ కు ఆయువుపట్టు వంటి దుబ్బాకలోనే గెలిచామని, ఇకపై ఈ జోరును రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామని అన్నారు. దుబ్బాక ఎన్నిక ఫలితం రాష్టవ్యాప్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని కిషన్ రెడ్డి చెప్పారు.

పార్టీ పరంగా చూస్తే దుబ్బాక విజయం బీజేపీకి ఎంతో బలాన్నిస్తుందనడంలో సందేహంలేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. దుబ్బాక విజయం ప్రజల విజయం అని పేర్కొన్నారు. బీహార్ లోనూ బీజేపీ హవా కొనసాగుతుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Kishan Reddy
BJP
Dubbaka
Win
GHMC

More Telugu News