Dubbaka: దుబ్బాక ఉపఎన్నిక.. 15, 16వ రౌండ్లలో కూడా కారుదే జోరు

TRS Leads in 15 and 16 rounds in Dubbaka counting
  • వరుసగా 13, 14, 15, 16 రౌండ్లలో టీఆర్ఎస్ గెలుపు
  • 15వ రౌండులో 955 ఓట్ల ఆధిక్యత
  • 16వ రౌండులో 674 ఓట్ల లీడింగ్
దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ క్రమంగా జోరు పెంచుతోంది. వరుసగా 13, 14, 15, 16 రౌండ్లలో సత్తా చాటింటి. 15వ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థికి 955 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 16వ రౌండులో 749 ఓట్ల మెజార్టీ వచ్చింది. 16వ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థికి 3,157 ఓట్లు రాగా... బీజేపీకి 2,408, కాంగ్రెస్ కు 674 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 1,734 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే క్రమంగా టీఆర్ఎస్ పుంజుకుంటుండటంతో బీజేపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న రౌండ్ల కౌంటింగ్ మరింత ఉత్కంఠను పెంచనుంది. మరోవైపు ఇప్పటి వరకు నోటాకు 414 ఓట్లు పడటం గమనార్హం.
Dubbaka
TRS
BJP
Congress

More Telugu News