Arogyasri: నేటి నుంచి ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ... క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచిత చికిత్స

  • రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ విస్తరణ
  • ఇప్పటివరకు 7 జిల్లాల్లో సేవలు
  • నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ
  • చికిత్సల జాబితాలో మరో 234 వ్యాధులకు స్థానం
AP Government implements Arogyasri in all districts in state

ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు వర్తింపచేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను ఆయన ప్రారంభించారు. ఇకపై క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటివరకు 7 జిల్లాల్లోనే అమలైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితాకు అదనంగా మరో 234 వ్యాధులను కూడా ప్రభుత్వం చేర్చింది. ఆసుపత్రుల్లో రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. బిల్లు రూ.1000 దాటితే మిగతా బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది.

More Telugu News