Bihar: మారిన తొలి ట్రెండ్స్... ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీయే... అతిపెద్ద పార్టీగా బీజేపీ!

  • నిమిషాల వ్యవధిలో పుంజుకున్న ఎన్డీయే
  • ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యం
  • 101 సీట్లకు పడిపోయిన మహా ఘటబంధన్
NDA Clearly Leads in Bihar

బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యపు బలాబలాలు మారిపోయాయి. ఉదయం 10 గంటల వరకూ స్పష్టమైన ఆధిక్యంలో ఉండి, సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన మహా ఘటబంధన్, ఆపై అనూహ్యంగా వెనక్కు పడిపోయింది. ఎన్డీయే మెజారిటీ నంబర్ 122తో పోలిస్తే 8 అధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే ప్రస్తుతం 130 చోట్ల ఆధిక్యంలో ఉండగా, మహా ఘటబంధన్ 101 చోట్ల ఆధిక్యంలో ఉంది. కింగ్ మేకర్ గా మారతారని భావించిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 4 స్థానాలకు, ఇతరులు 8 స్థానాలకు పరిమితం అయ్యారు.

ఇక, బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుంది. దాదాపు 70 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఆ తరువాత ఆర్జేడీ అభ్యర్థులు 50 స్థానాల వరకూ, జేడీయూ 35 స్థానాల వరకూ, కాంగ్రెస్ 20 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల్లో బీహార్ ఫలితాలపై పూర్తి స్పష్టత వెలువడుతుంది.

More Telugu News