KC Tyagi: తేజస్వికే పట్టం.. అప్పుడే ఓటమిని అంగీకరించిన నితీశ్ కుమార్ పార్టీ ప్రతినిధి

  • ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు
  • ఆర్జేడీ చేతిలోనో లేక తేజస్వి చేతిలోనో మేము ఓడిపోలేదు
  • కోవిడ్ మహమ్మారి చేతిలో మేము ఓడిపోయాం
Nitish Kumars party spokesperson accepts party defeat

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 31 ఏళ్ల తేజస్వి యాదవ్ సీఎం పదవిని చేపట్టే దిశగా ట్రెండ్స్ వెలువడుతున్నాయి. మరోవైపు నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రాథమిక దశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. తాము ఆర్జేడీ చేతిలోనో లేక తేజస్వి చేతిలోనో ఓడిపోలేదని... దేశాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి చేతిలో ఓడిపోతున్నామని చెప్పారు.

కేవలం కరోనా వల్లే తాము వెనుకబడ్డామని త్యాగి అన్నారు. గత 7 దశాబ్దాలుగా బీహార్ క్షిణిస్తూ వచ్చిందని... దాని ప్రభావం కూడా ఇప్పుడు తమపై పడిందని చెప్పారు. మరోవైపు బీహార్ లో నితీశ్ కుమార్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆర్జేడీ ఉండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

More Telugu News