Bihar: తేజస్వి ఇంటి వద్ద కోలాహలం.. సంబరాలు

Supporters of RJD leader Tejashwi Yadav outside his residence
  • ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు
  • ఆధిక్యం దిశగా మహాఘట్‌బంధన్
  • తేజస్వి ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలా ఉన్నాయి. దీంతో పాట్నాలోని మహాఘట్‌బంధన్ సారథి, లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ట్రెండ్స్ చూసి మహాఘట్‌బంధన్ విజయం ఖాయమని సంతోషం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. తేజస్వి ఫొటోలు, ఆర్జేడీ జెండాలు చేబూని సంబరాలు చేసుకున్నారు.  నినాదాలు చేస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ ఆనందం సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Bihar
Tejashwi Yadav
RJD
Assembly Polls

More Telugu News