Rajasekhar: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన హీరో రాజశేఖర్... ఫొటోలు ఇవిగో!

Hero Rajasekhar discharged after severe battle with corona
  • ఇటీవల కరోనా బారినపడిన రాజశేఖర్ కుటుంబం
  • కొన్నిరోజుల్లోనే కోలుకున్న మిగతా కుటుంబసభ్యులు
  • సిటీ న్యూరో సెంటర్ లో రాజశేఖర్ కు అత్యవసర చికిత్స
కొన్నివారాల కిందట కరోనా బారినపడి ఆసుపత్రి పాలైన హీరో రాజశేఖర్ కోలుకున్నారు. ఆయన ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడడంతో తీవ్ర అస్వస్థతకు గురైన రాజశేఖర్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రాజశేఖర్ భార్య జీవిత, కుమార్తెలు శివాత్మిక, శివానీ కూడా కరోనా బారినపడినా, రాజశేఖర్ తప్ప అందరూ కొన్నిరోజుల్లోనే కోలుకున్నారు.

రాజశేఖర్ పరిస్థితి ఓ దశలో విషమించడంతో ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. కాగా, డిశ్చార్జి అయిన సందర్భంగా తీసిన ఫొటోలో రాజశేఖర్ బాగా నీరసించిన స్థితిలో కనిపిస్తున్నారు. ఏదేమైనా రాజశేఖర్ క్షేమంగా బయటపడడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి.
Rajasekhar
Corona Virus
Positive
Discharge
Tollywood

More Telugu News