Supernovas: మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్: టాస్ గెలిచిన సూపర్ నోవాస్

Harmanpreet led Supernovas won the toss in Womens Challenge
  • టైటిల్ పోరులో సూపర్ నోవాస్ వర్సెస్ ట్రెయిల్ బ్లేజర్స్
  • బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్
  • టోర్నీ నుంచి నిష్క్రమించిన వెలాసిటీ
ఐపీఎల్ సందర్భంగా మహిళల జట్లతో నిర్వహిస్తున్న టీ20 చాలెంజ్ నేటితో ముగియనుంది. షార్జాలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్ బౌలింగ్ ఎంచుకుంది. మొత్తం మూడు జట్లు లీగ్ దశలో ఆడగా, మెరుగైన రన్ రేట్ తో సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. తక్కువ రన్ రేట్ ఉండడంతో మిథాలీ రాజ్ సారథ్యంలోని వెలాసిటీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్ కౌర్, ట్రెయిల్ బ్లేజర్స్ కు స్మృతి మంథన కెప్టెన్లు. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ట్రెయిల్ బ్లేజర్స్ జట్టులో దయాలన్ హేమలత స్థానంలో నుజ్ హత్ పర్వీన్ తుదిజట్టులోకి వచ్చింది. ఇక సూపర్ నోవాస్ జట్టులో ఒక మార్పు జరిగింది. ప్రియా పూనియా స్థానంలో పూజా వస్త్రాకర్ కు స్థానం కల్పించారు.
Supernovas
Toss
Trail Blazers
Womens T20 Challenge
Sharjah

More Telugu News