Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ప’ తాజా షెడ్యూల్ షూటింగ్.. వీడియో పోస్ట్ చేసిన చిత్ర యూనిట్!

pushpa shoot resumes
  • మళ్లీ రేపటి నుంచి షూట్
  • మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
  • మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్
కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగులు ఆగిపోవడంతో కొన్ని నెలల పాటు ఇంటి వద్దే గడిపిన సినీనటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం మళ్లీ షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పుష్ప’లో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసింది. దర్శకుడు సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్, ఇతర యూనిట్ సభ్యులు ఇందులో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరగబోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Pushpa
Allu Arjun
sukumar
Tollywood
Viral Videos

More Telugu News