నంద్యాల ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్యపై సీఎం జగన్ కు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ
- నవంబరు 3న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య
- పోలీసుల వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో
- న్యాయ విచారణ జరపాలంటూ సీపీఐ రామకృష్ణ డిమాండ్
నవంబరు 3న కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు వద్ద రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కనిపించడం సంచలనం సృష్టించింది. మృతి చెందిన వారిని నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం, ఆయన భార్య నూర్జహాన్, కుమార్తె సల్మా, కుమారుడు దాదా ఖలందర్ గా గుర్తించారు. ఓ చోరీ కేసులో తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు సలాం ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వెలిబుచ్చారు.