సీఎం కేసీఆర్ అర్ధాంగి పెద్దమనసు... ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి చేయూత
- భారీవర్షాలకు కరీంనగర్ లో వ్యక్తి మృతి
- దిక్కుతోచని స్థితిలో కుటుంబం
- చలించిపోయిన సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ
ఈ విషయం తెలిసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ చలించిపోయారు. తిరుపతి కుటుంబానికి ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తనవంతుగా లక్ష రూపాయలు ప్రకటించారు. ఆ సాయాన్ని చొప్పదండి శాసనసభ్యుడు రవిశంకర్ ద్వారా బాధితులకు అందించారు. అటు, ఇతరులు కూడా ఆర్థికసాయం చేయగా మొత్తం మూడు లక్షల రూపాయలు అయ్యాయి. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే రవిశంకర్.... తిరుపతి కుటుంబసభ్యులకు అందించారు. వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.