KA Paul: ట్రంప్ ఓటమి అనంతరం అమెరికా వీధుల్లో డ్యాన్సులు చేసిన కేఏ పాల్

KA Paul dances after Trump defeat
  • ట్రంప్ ను హెచ్చరించానన్న పాల్
  • ట్రంప్ తన మాట వినలేదని వెల్లడి
  • ట్రంప్ పై పుస్తకం రాశానని వివరణ
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖరారైన సంగతి తెలిసిందే. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ నూతన అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో బైడెన్ ఘనవిజయం సాధించారు. కాగా, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ తాను గత ఏడాది కాలంగా ట్రంప్ ఓటమికోసం శ్రమిస్తున్నానని వెల్లడించారు. ట్రంప్ ను గతంలోనే హెచ్చరించానని, కానీ ట్రంప్ తన మాట వినలేదని తెలిపారు. ఆయనపై ఓ పుస్తకం కూడా రాసి ఎలుగెత్తానని వివరించారు. ఈ క్రమంలో ఆయన అమెరికాలో వీధుల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. చూడు ట్రంప్... ఈ జనాన్ని చూడు అంటూ వ్యాఖ్యానించారు.
KA Paul
Donald Trump
Dance
USA

More Telugu News