తన కొత్త సినిమా కోసం పనిచేసిన వందలమందికి దీపావళి కానుక ఇచ్చిన తమిళ హీరో శింబు

08-11-2020 Sun 14:15
  • 'ఈశ్వరన్' చిత్రంలో నటిస్తున్న శింబు
  • మరికొన్నిరోజుల్లో దీపావళి
  • ఒక గ్రాము బంగారు నాణెం కానుకగా ఇచ్చిన శింబు
  • జూనియర్ ఆర్టిస్టులకు కొత్త దుస్తులు
Hero Simbu gifted his new movie crew one gram gold coins
తమిళ హీరో శింబులో మరో కోణం వెల్లడైంది. గతంలో తన సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లోకెక్కిన ఈ యువ హీరో తాజాగా తన కొత్త చిత్రం కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులకు దీపావళి సందర్భంగా కానుకలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. శింబు ప్రస్తుతం 'ఈశ్వరన్' అనే చిత్రంలో నటించాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విలేజ్ నేటివిటీతో తెరకెక్కుతోంది.

మరికొన్నిరోజుల్లో దీపావళి వస్తుండడంతో శింబు తన యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేశాడు. 'ఈశ్వరన్' చిత్రం కోసం పనిచేస్తున్న 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం కానుకగా ఇచ్చాడు. 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కొత్త దుస్తులు అందజేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది.