Vijayashanti: ఎవరి తీసిన గోతిలో వారే పడతారు: సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి

Vijayasanthi targets CM KCR
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని ఆరోపణ
  • బీజేపీ సవాలు విసిరే స్థాయికి చేరిందని వ్యాఖ్యలు
  • కాలం, ప్రజలే నిర్ణయించాలని సోషల్ మీడియాలో స్పందన
తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి తన విమర్శల్లో పదును పెంచారు. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ కు వర్తింపజేసే సమయం దగ్గరపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి, ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ ను బలహీనపరిచే చర్యల వల్ల ఇప్పుడు బీజేపీ వంటి జాతీయపార్టీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందని తెలిపారు.

మాణికం ఠాగూర్ మరికొంత ముందుగానే రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిణామాలను కాలం, ప్రజలే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు.
Vijayashanti
KCR
Congress
BJP
TRS
Telangana

More Telugu News