M C Kamaruddin: కేరళ గోల్డ్ స్కామ్.. ఆరు గంటల విచారణ అనంతరం ఎమ్మెల్యే అరెస్ట్

  • కమరుద్దీన్‌పై మొత్తం 115 మంది ఫిర్యాదు
  • తొలి ముగ్గురి ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్
  • రూ. 15 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు
IUML MLA Kamaruddin arrested in Kerala over Rs 15 crore gold scam

గోల్డ్ స్కామ్ కేసులో మంజేశ్వర్ ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేత ఎంసీ కమరుద్దీన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఏఎస్‌పీ వివేక్ కుమార్ సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎమ్మెల్యేను ఆరు గంటలపాటు విచారించింది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ  కేసులో ఆయనను తొలిసారి ప్రశ్నించారు. తమను రూ. 36 లక్షల మేర మోసం చేసినట్టు ఆగస్టు 28న ముగ్గురు డిపాజిటర్లు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. 

ఫ్యాషన్ గోల్డ్ బ్రాండ్ పేరుతో సాగిన ఈ బంగారు వ్యాపారంలో జరిగిన మోసానికి సంబంధించి అప్పటి నుంచి 115 మంది డిపాజిటర్లు కమరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై నాన్-బెయిలబుల్ నేరం కింద కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా మొత్తం 77 మంది ఫిర్యాదుదారుల రూ. 33 కోట్ల మోసానికి సంబంధించి అధికారులు ప్రశ్నించారు. అయితే, తొలి మూడు కేసుల్లోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆయన రూ. 15 కోట్ల మోసానికి పాల్పడినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News