White House: డెమొక్రాట్ల సెలబ్రేషన్స్ చూస్తూ శ్వేతసౌధంలోకి వెళ్లిన అధ్యక్షుడు!

Trump Arrives White House after seeing Democrats Celebrations
  • శనివారమంతా గోల్ఫ్ క్లబ్ లో గడిపిన ట్రంప్
  • సాయంత్రం తిరిగి శ్వేతసౌధానికి
  • ఎదురుగా ప్లాజా వద్ద సెలబ్రేషన్స్
తాను ఓడిపోయానని తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల సెలబ్రేషన్స్ చూస్తూ వైట్ హౌస్ లోకి వెళ్లాల్సి వచ్చింది. శనివారం ఉదయం నుంచి గోల్ఫ్ ఆడుతూ, ఎన్నికలకు సంబంధించిన వార్తలను తెలుసుకుంటూ ఉన్న ట్రంప్, సాయంత్రం బైడెన్ చేతిలో తాను ఓడిపోయానని తెలుసుకున్న తరువాత, శ్వేతసౌధానికి బయలుదేరారు.

అప్పటికే వైట్ హౌస్ ఎదురుగా ఉన్న బ్లాక్ లివ్స్ మాటర్ ప్లాజా వద్దకు డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ నేత బైడెన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అదే రూట్లో వైట్ హౌస్ కు వస్తున్న ట్రంప్, వారిని చూస్తూనే లోనికి ప్రవేశించాల్సి వచ్చింది.

కాగా, ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారని అన్ని న్యూస్ ఏజన్సీలూ తేల్చి చెప్పగా, ఇంతవరకూ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎవరికి ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించాల్సి వుంది. అయితే ఎన్నికల్లో బైడెన్ గెలిచేశారని కౌంటింగ్ ను పరిశీలిస్తున్న వారంతా తేల్చి చెప్పేశారు. 

White House
Donald Trump
Celebrations
Democratics

More Telugu News