America: ‘వియ్ డిడ్ ఇట్’.. విజయం సాధించిన బైడెన్‌కు ఫోన్ చేసి అభినందించిన కమలా హారిస్

we did it kamala harris happy movements with biden
  • బైడెన్ విజయం సాదించడంపై హర్షం
  • ఉపాధ్యక్షురాలు కానున్న భారత సంతతకు చెందిన తొలి మహిళగా రికార్డు
  • ఈ విజయాన్ని అమెరికన్ల ఆత్మగా అభివర్ణించిన కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించిన బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె రన్నింగ్ మేట్ అయిన భారత సంతతికి చెందిన కమలా హారిస్  అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కానున్నారు. బైడెన్ విజయం సాధించిన అనంతరం ఆయనకు ఫోన్ చేసిన కమల.. ‘మనం సాధించాం’ అని ఫోన్ చేసి చెప్పి అభినందించారు. ‘తదుపరి అధ్యక్షుడు మీరే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బైడెన్ విజయాన్ని ఆమె అమెరికన్ల ఆత్మకు సంబంధించినదిగా అభివర్ణించారు. ‘ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్’ అంటూ ఓ వీడియో సందేశాన్ని కమల తన ట్విట్టర్ ఖాతాలోపోస్టు చేశారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు.
America
Joe Biden
Kamala Harris
Vice president

More Telugu News